Share News

Weather Update: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:17 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. వానాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు మరో నాలుగు రోజులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

Weather Update: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
Weather Update

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. వానాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు మరో నాలుగు రోజులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. నేటి నుంచి జులై 13 వరకు కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అదే సమయంలో గుజరాత్, ఉత్తర కర్ణాటకలో జూలై 10 నుంచి 13 వరకు.. సౌరాష్ట్ర, కచ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్(andhra pradesh), తెలంగాణ(telangana)లో జూలై 12 వరకు, కేరళ, మహీ, దక్షిణ కర్ణాటకలో జూలై 12, 13 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది.


భారీ వర్షాలు

మరోవైపు జులై 10 నుంచి 13 వరకు మధ్యప్రదేశ్‌(madhya pradesh)లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్య తూర్పు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జులై 10 నుంచి 12 వరకు, జులై 11 నుంచి 12 మధ్య హిమాచల్ ప్రదేశ్, జూలై 12న జమ్మూ, ఉత్తర హర్యానా, ఉత్తర పంజాబ్, జులై 9 నుంచి 11 వరకు తూర్పు రాజస్థాన్, జులై 10న విదర్భ, జూలై 11 నుంచి 13 వరకు ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే సమయంలో గోవా రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.


ఏడుగురు మృతి

ఇక జులై 10 నుంచి 11 వరకు మధ్య పశ్చిమ బెంగాల్, సిక్కింలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జులై 10-13 మధ్య బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో, జూలై 12, 13 తేదీలలో జార్ఖండ్; జులై 10, 13న ఒడిశాతో పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక నదులు, చెరువులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. దీంతోపాటు కొండ ప్రాంతాలలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీని కారణంగా చాలా రహదారులు మూసుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా 42 చోట్ల రోడ్లు మూసివేయబడ్డాయి.


ఇది కూడా చదవండి:

National : నకిలీ కంపెనీలు.. బలవంతపు చాకిరీ!


Bhuvaneshwar : పూరీ ‘రత్న భండార్‌’ను 14న తెరవాలి

For Latest News and National News click here

Updated Date - Jul 10 , 2024 | 07:20 AM