Home » Weather
నైరుతి రుతుపవనాలు బుధవారం తెలంగాణ మొత్తం, చత్తీస్గఢ్లోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. చార్మినార్ సర్దార్ మహల్లో అత్యధికంగా 4.8, వారాసిగూడ బౌద్ధ నగర్లో 4.7 సెం.మీ వర్షం కురిసింది. రామాంతాపూర్, కాప్రా, హయత్నగర్, బండ్లగూడ, అంబర్పేట, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో 4 సెం.మీ.కుపైగా వాన పడింది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇంకోవైపు రాబోయే 48 గంటల్లో కొంకణ్ & గోవా(goa) మధ్య మహారాష్ట్ర(maharashtra), మరాఠ్వాడా, కోస్టల్ & నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
దేశంలో నైరుతి రుతుపవనాల(Southwest Monsoon) రాక మొదలైంది. ఈ క్రమంలో అనేక చోట్ల వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతోపాటు కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షాలు (Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shantikumari) సంబంధిత అధికారులతో నేడు(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rains) పడుతోంది. మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నైరుతి రుతు పవనాలు కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఉత్తరాంధ్ర సహా మరికొన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. రాయలసీమలో ఆవర్తనం విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అశోక్ నగర్లో భారీ వర్షం కురుస్తోంది.
భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా ఉంది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది.