Share News

Rain Alert: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:20 PM

గ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( శుక్రవారం) ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది.

Rain Alert: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్: భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఈరోజు( శుక్రవారం) ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, మెహదీపట్నం , మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, షేక్‌పేట్, గోల్కొండ, టోలిచౌకి, రాయదుర్గం, బండ్లగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, కర్మన్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌లలో భారీ వర్షం పడుతోంది. వాన పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.


వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా.. రానున్న3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు, రేపు(శుక్ర, శని) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Updated Date - Jul 05 , 2024 | 08:35 PM