Home » Weather
Monsoon Updates: రుతుపవనాలు(Monsoon) కాలానుగుణంగా ఏర్పడుతాయి. మన దేశంలో రెండు రకాల రుతుపవనాలు ఉన్నాయి. అవి మొదట ఏర్పడే నైరుతి రుతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య రుతుపవనాలు. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పే రుతుపవనాలు.
ఏటా ఆలస్యంగా పలకరించే నైరుతి రుతుపవనాలు(Monsoon Season).. ఈ ఏడాది త్వరగా వస్తున్నాయి. జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పలకరించే రుతుపవనాలు.. గురువారం కేరళ తీరాన్ని తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు.
దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో వేసవి తీవ్రత బాగా పెరిగింది. ఆ నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్‌గా మారడంతో పాటు తేమ శాతం ఎక్కువ కావడమే ఇందుకు కారణమని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎ్‌సఈ) అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆ నగరాల్లో రాత్రిపూట కూడా వాతావరణం చల్లబడలేని పరిస్థితి నెలకొంది.
AP and TG Weather Updates: తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉంది. కాసేపు ఎండలు దంచుతుండగా.. మరికాసేపు ఈదురు గాలులు, వడగళ్ల వానతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెమాల్ తుపాను ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
Weather Updates: రైతాంగానికి భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రుతుపవనాల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు.. పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉంటే..
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రెమాల్ తుఫాన్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే పలు ప్రాంతాల్లో భారీ వాన పడింది.
'రెమాల్(Remal)' తుపాను ఆదివారం రాత్రి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు విమానాలతోపాటు రైళ్లను కూడా రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈ అల్పపీడనం కాస్తా తుపాన్‌గా మారడంతో అక్కడక్కడ చెదురు ముదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.