Share News

Rains Alert: భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో...

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:56 PM

గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది.

 Rains Alert: భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో...
Heavy Rain

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది.. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా కూల్ గా మారింది. LB నగర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


వర్షంధాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇప్పటికే వాతావరణ అధికారులు నైరుతి రుతపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

NDA Alliance: ప్రధాని నివాసంలో ప్రారంభమైన ఎన్డీఏ పక్ష నేతల సమావేశం

YSRCP: వైసీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యే దుమారం రేపే వ్యాఖ్యలు.. ఆ ఒక్కడే..!!

AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 06:11 PM