Share News

Rain Alert: భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:58 PM

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అశోక్ నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది.

Rain Alert: భాగ్యనగర వాసులకు అలర్ట్.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదారాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, షేక్ పేట్, గోల్కొండ, టోలిచౌకి, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అశోక్ నగర్‌, బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఆఫ్జల్ గంజ్, నాంపల్లి,మంగళ్ హాట్, కవాడిగూడ, అశోక్ నగర్, దోమలగూడ, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లిలో భారీ వర్షం పడుతోంది.

అశోక్ నగర్ చౌరస్తా స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 17 వద్ద రెండు విద్యుత్ స్తంభాలు, ఓ భారీ వృక్షం నేలకొరిగింది. పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని చేరుకొని విద్యుత్ స్తంభాలు చెట్లను తొలగించి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


భారీ వర్షం కురుస్తోండటంతో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం నెలకొంది. వర్షం ధాటికి చెట్ల కొమ్మలు, భారీ హోర్డింగులు కింద పడ్డాయి. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే 040-21111111,9000113667 టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రందించాలని కోరారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు. అయితే తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు(గురువారం) కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. శుక్రవారం, శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Kishan Reddy: తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బీజేపీ

Hyderabad: ఆరు నెలల్లో అంతా తారుమారు అయ్యిందిగా..

Hyderabad: ఔరంగాబాద్‌లో ఓటమితో లోక్‌సభలో మజ్లిస్‏కు మళ్లీ ఒకే ఒక్కడు..!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 08:21 PM