Share News

Rains: ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:56 AM

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇంకోవైపు రాబోయే 48 గంటల్లో కొంకణ్ & గోవా(goa) మధ్య మహారాష్ట్ర(maharashtra), మరాఠ్వాడా, కోస్టల్ & నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

Rains: ఇవాళ, రేపు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
imd alert heavy rains

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ(telangana)లో మంగళ, బుధవారాల్లో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతోపాటు హైదరాబాద్‌లో మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు పురోగమించాయని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దక్షిణ గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు సహా తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని తెలిపారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌(andhra pradesh)లో రాగల 24 గంటల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాగల 72 గంటల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించవచ్చని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.


ఇంకోవైపు రాబోయే 48 గంటల్లో కొంకణ్ & గోవా(goa) మధ్య మహారాష్ట్ర(maharashtra), మరాఠ్వాడా, కోస్టల్ & నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రుతుపవనాల ప్రారంభంతో సోమవారం ఉదయం ముగిసిన 24 గంటల్లో ముంబై వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం & మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం ప్రాంతాల్లో జూన్ 14 వరకు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం


Prime Minister Modi : మరో 3 కోట్ల ఇళ్లు


SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌


Read Latest National News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 08:00 AM