Home » West Bengal
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులోభాగంగానే చంపయి సోరెన్ పార్టీ వీడారని పేర్కొంది. అదివాసీల సంక్షేమం కోసం సోరెన్ కుటుంబం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి హేమంత్ సోరెన్‌ను బీజేపీ జైలుకు పంపిందన్నారు.
''బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.
పశ్చిమబెంగాల్లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగస్ట్ 28వ తేదీన పశ్చిమ బెంగాల్లో 12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్ జరుపనున్నట్టు తెలిపింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా 'నబన్నా అభియాన్' పేరుతో విద్యార్థులు మంగళవారంనాడు రోడ్లెక్కారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లతో విద్యార్థి సంఘం 'పశ్చిమబంగా ఛాత్రో సమాజ్' చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటకి వెల్లడించలేదు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.