Home » West Bengal
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.
కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 32 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి కఠిన శిక్ష విధించాలని అతడి తల్లి డమాండ్ చేశారు.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పెరగడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం జరిగినట్టు భావిస్తున్న ఆసుపత్రి సెమినార్ హాలు డోర్ బోల్డ్ విరిగిపోవడం తాజాగా సీబీఐ దృష్టికి వచ్చింది.
తమ కుమార్తె డైరీలో మూడు పేజీలు కనిపించట్లేదని కోల్‌కతా(Kolkata) ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు.
జన్మదినం సందర్భంగా ప్రొ. సందీప్ ఘోషకు సీఎం మమతా బెనర్జీ బర్త్ డే విషెష్ చెబుతున్న ఓ లేఖ ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదీకూడా 2022, జూన్ 30వ తేదీ ప్రొ. సందీప్ జన్మదినం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఈ లేఖ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పినట్లుగా ఆ లేఖలో స్పష్టంగా ఉంది.
కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదించ వద్దని కపిల్ సిబల్‌కు అధిర్ రంజన్ చౌదరి హితవు పలికారు. ఈ కేసు నుంచి వైదొలగాలని ఆయనను అభ్యర్థించాలనుకుంటున్నారన్నారు.
యావద్దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతిలోకి నెట్టిన కోల్‌కతా వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ ఆస్పత్రిలో క్రైమ్ న్‌సీన్‌ను మార్చేశారని సీబీఐ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్ర మఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు.
కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు.