Kolkata Doctor Case: వైద్యుల భద్రతకు సుప్రీం భరోసా.. ఆందోళన విరమించిన డాక్టర్లు..
ABN , Publish Date - Aug 22 , 2024 | 04:27 PM
కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు.
కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఆందోళన బాటపట్టిన వైద్యులు వెనక్కి తగ్గారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం విజ్ఞప్తితో ఎయిమ్స్ వైద్యులు తమ ఆందోళనకు విరామం పలికారు. వైద్యులు విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని సుప్రీంకోర్టు డాక్టర్లకు హామీ ఇచ్చింది. కోల్‌కతా ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం వలన తమను వేధిస్తున్నారంటూ కొందరు ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ముందుగా విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్లను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా తమ విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్న వైద్యులు సైతం విధుల్లో చేరాలని న్యాయస్థానం కోరింది. దీంతో 11 రోజులుగా నిర్వహిస్తున్న నిరసనలకు వైద్యులు విరామం ప్రకటించారు. వైద్యుల భద్రత విషయంలోనూ అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. వైద్యుల భద్రత విషయంలో తీసుకోవల్సిన చర్యలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేసింది. వైద్యుల పని గంటల విషయంలోనూ సుప్రీంకోర్టు స్పందించింది. వైద్యులపై ఒత్తిడి లేకుండా చూడాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విజ్ఞప్తితో వైద్యులు తమ ఆందోళనను విరమించి విధుల్లో చేరనున్నారు.
Vijay: పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన విజయ్..
గతకొద్ది రోజులుగా..
కోల్‌కతాలో అభయ ఘటనను నిరసిస్తూ వైద్యులు తమ విధులను బహిష్కరించి తమ నిరసన తెలుపుతున్నారు. ఎయిమ్స్‌లో రెసిడెంట్ డాక్టర్లు ఓపీ సేవలను బహిష్కరిస్తున్నారు. ప్రయివేట్ ఆసుపత్రులు సైతం 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేసింది. దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అభయ హత్యాచారం కేసు విచారణ సందర్భంగా వైద్యుల భద్రతపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. వారి భద్రత విషయంలో తగిన చర్యలు ఉంటాయని భరోసా ఇచ్చింది. ఈ క్రమంలో వైద్యులు తిరిగి విధుల్లో చేరనున్నారు.
CBI: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సుప్రీంకు సీబీఐ సంచలన రిపోర్ట్
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్..
వైద్యుల భద్రతకు సంబంధించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. దేశంలోని వైద్య రంగానికి చెందిన ప్రముఖులతో ఏర్పడిన ఈ కమిటీ సమావేశమై వైద్యుల భద్రతకు సంబంధించి తీసుకోవల్సిన చర్యలపై ఓ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా సుప్రీంకోర్టు డాక్టర్ల సంరక్షణ విషయంలో పలు ఆదేశాలు జారీచేసే అవకాశం ఉంది. దేశంలోని వైద్యులను సంప్రదించి వారి సమస్యలను ఈ టాస్క్‌ఫోర్స్ తెలుసుకోనుంది.
Accident: బస్సును ఢీకొట్టిన ట్యాంకర్.. ఐదుగురు మృతి, మరో 20 మందికి గాయాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News