Home » Whatsapp
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మినలపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్, ఫేస్బుక్, ఇనస్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో చాలా మంది రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లను ముట్టడిస్తాం, దాడులు చేస్తామని బెదిరిస్తూ, తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అవాస్తవాలు ..
వాట్సాప్ గ్రూప్‌లో తన పుట్టినరోజు వేడుకల ఫొటోలతో పాటు గ్రూప్ నుంచి తనను తొలగించడంతో కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఇద్దరు యువకులను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
విభిన్న అప్డేట్లతో ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకుంటున్న వాట్సప్(WhatsApp) ఇప్పుడు మరో అప్డేట్తో వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్టేటస్ నిడివిని ఒక నిమిషానికి పెంచిన వాట్సప్.. తాజాగా వాట్సప్ స్టేటస్ వాయిస్ నిడివిని కూడా నిమిషానికి పెంచింది.
వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.
ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్వర్డ్లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు.
వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్(WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా WhatsApp ఒక కొత్త ఫీచర్‌ను(new feature) అనౌన్స్ చేసింది. దీని సహాయంతో మీరు యాప్‌లోనే ఏదైనా ఈవెంట్‌ని ప్లాన్(event planning) చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఈవెంట్ ఇన్విటేషన్లను పంపుకోవచ్చు.
తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ప్రతీదీ రీఫ్రెషింగ్‌గా అనిపించేలా ఉండటం కోసం.. ‘మెటా’ (Meta) సంస్థ వాట్సాప్‌లో (WhatsApp) రకరకాల అప్డేట్స్, వినూత్నమైన మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా...
తమ వినియోగదారుల సందేశాలకు సంబంధించి ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని బలవంతం చేస్తే నిరభ్యంతరంగా భారత్ నుంచి వైదొలుగుతామని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసింది.
వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా రూపొందిస్తోంది. త్వరలో మరో ఫీచర్ రాబోతుంది. ఇకపై మొబైల్లో నెట్ లేకున్నా వాట్సాప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృసంస్థ మెటా వెల్లడించింది.