Home » Yogi Adityanath
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.
మరోసారి మత సామరస్యం వెల్లివిరిసింది. అవును ఓ ముస్లిం యువకుడు రామచరిత్ మానస్ తప్పులు లేకుండా అద్భుతంగా పారాయణం చేశాడు. ఆ క్రమంలో చూసిన సీఎం అతని ప్రతిభను చూసి మెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.
అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అహ్మదాబాద్ - అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు.
శ్రీరాముని నామంతో అయోధ్యపురి మారుమోగుతోంది. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమిలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య పురవీధుల్లో భక్త జన సంచారం పెరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.
మన భారతదేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాంతో..
నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చిన బుల్డోజర్.. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. తాజాగా.. యోగి సర్కార్ నేరగాళ్లపై మరోసారి చర్యలు తీసుకుంది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ ఏర్పాట్లను శుక్రవారంనాడు స్వయంగా పర్యవేక్షించారు. తొలుత రామ్ లల్లా, హనుమాన్‌గడీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.