Share News

Yogi Adityanath: ఢిల్లీ సీఎంను బీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్.. దేశంలోనే టాప్

ABN , Publish Date - Feb 04 , 2024 | 08:12 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.

Yogi Adityanath: ఢిల్లీ సీఎంను బీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్.. దేశంలోనే టాప్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath)కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత X ఖాతా (@myogiadityanath)ను 27.4 మిలియన్ల మందికిపైగా ఫాలో అవుతున్నారు. దీంతో యోగి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అత్యధికంగా పాపులారిటీ ఉన్న వ్యక్తిగా నిలిచారు.

ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ X 27.3 మిలియన్ల మంది ఫాలోవర్లను యోగి అధిగమించారు. రాహుల్‌ గాంధీకి ఎక్స్‌లో 24.8 మిలియన్ల మంది, అఖిలేష్‌ యాదవ్‌కు 19.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Bharat Ratna LK Advani : భారతరత్నం ఆడ్వాణీ


జనవరి 2019లో ప్రారంభమైన యోగి ఆదిత్యనాథ్ Xఖాతా ప్రస్తుతం దేశంలో సీఎంలలో అత్యధిక మంది అనుచరులను కలిగి ఉన్న వ్యక్తిగత అధికారిక ఖాతాగా మారింది. యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాత్మక నాయకత్వం, ప్రభావవంతమైన నిర్ణయాలు ఆయనకు ప్రజల్లో బాగా ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నాయి. అంతేకాదు యోగికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదరణ ఉండటం విశేషం. ఆయన నేరస్థులను అరికట్టే చర్యలు సహా అనేక పనులు మరింత క్రేజ్‌ను పెంచుతున్నాయని చెప్పవచ్చు.

ఇక దేశంలో రాజకీయ నాయకుల పరంగా చూస్తే యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం Xలో దేశంలోనే అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న రాజకీయ నేతలుగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. మోదీకి Xలో 95.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 34.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు.

ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 24 మిలియన్ల మంది, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి 13.7 మిలియన్ల మంది ఫాలోవర్లు కలరు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో 5.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

Updated Date - Feb 04 , 2024 | 08:12 AM