Home » Yogi Adityanath
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
యూపీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశకు గురిచేయగా, దీనికి కారణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టత ఇచ్చారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పలుచోట్ల ఓటమికి కారణమని లక్నోలో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఎం పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
దైవ భక్తితో నాలుగు మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే.
ధార్మిక సంబంధమైన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపపథ్యంలో హత్రాస్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారంనాడు పర్యటించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? ఇందులో కుట్ర కోణం ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశాలిచ్చారు.