Mahakumbh 2025: రేపటి నుంచి మహా కుంభమేళాలో.. ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్.. రూట్ మ్యాప్ విడుదల..
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:07 PM
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.

Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా బుధవారం అమృత స్నానం చేయాలని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొన్ని రోజుల ముందు నుంచే ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు దాదాపు 30 గంటలుగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని మహా కుంభమేళాలో జనసమూహ నియంత్రణకు నో వెహికల్ జోన్ రూల్ తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. ఏయే సమయాల్లో ఈ నిబంధన జాతర జరిగే ప్రాంతంలో వర్తింస్తుందో రూట్ మ్యాప్ విడుదల చేసింది.
ప్రయాగ్‌రాజ్‌లో భారీ ట్రాఫిక్ జామ్:
రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ అమృత స్నానం కోసం కావున మహాకుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రయాగ్‌రాజ్ చుట్టుపట్ల 300 కి.మీ మేర వాహనాల నిలిచిపోవడమే ఇందుకు సాక్ష్యం. జాతర జరిగే ప్రాంతంలో భక్తులు నిమిషాల్లో నడవగలిగే దూరాన్ని చేరుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. మౌని అమావాస్య నాడు జరిగినట్లుగా తొక్కిసలాట ఏర్పడకుండా భక్తుల రద్దీ నియంత్రణకు ఈ సారి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది యూపీ ప్రభుత్వం. నో వెహికల్ జోన్ రూల్ సహా వీవీఐపీ పాసులను రద్దు చేస్తూ నిబంధనలు తీసుకొచ్చింది.
ఈ సమయాల్లో నో పార్కింగ్ రూల్.. వీవీఐపీ పాసులు రద్దు..
జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాను ఇప్పటి వరకూ 40 కోట్లకు మందికి పైగా భక్తులు సందర్శించారు. ఫిబ్రవరి 26 కుంభమేళాలో ఆఖరిరోజు. రేపటి నుంచి నియమిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉంటుంది. మహా కుంభమేళాకు 11 జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం రూట్ ప్లాన్ విడుదల చేసింది ప్రభుత్వం. 36 పార్కింగ్ స్థలాలలో మాత్రమే వాహనాలను పార్క్ చేయగలరు. సోమవారం రాత్రి 8 గంటల నుంచే మహాకుంభమేళా ప్రాంతంలో పరిపాలనా/వైద్య వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఫిబ్రవరి 13 గురువారం ఉదయం 8 గంటల వరకు ఈ నిబంధన అమలవుతుంది.
భక్తులు సజావుగా స్నానం చేయడానికి వీలుగా ఫిబ్రవరి 11 ఉదయం 4 గంటల నుంచే మొత్తం మేళా ప్రాంతాన్ని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించారు. అత్యవసర సేవలకే అనుమతి ఉంటుంది.
అయితే, ఫిబ్రవరి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో 'నో వెహికల్ జోన్' అమలు చేయరు.
మహా కుంభ స్నానానికి బయటి నుంచి వచ్చే భక్తులు వాహనాలను ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల తర్వాత సంబంధిత పార్కింగ్ స్థలాల్లోనే పార్క్ చేయాలి. అవసరమైన, అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఉంటుంది.
ఫిబ్రవరి 12న మేళా ప్రాంతం నుంచి భక్తులను సజావుగా తరలించే వరకూ అడ్వైజరీలో పేర్కొన్న ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉంటాయి.
ప్రయాగ్‌రాజ్, మేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం, నిష్క్రమణపై ఉన్న ఈ ఆంక్షలు 'కల్పవాసి' వాహనాలకు కూడా వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి..
Supreme Court: మీరు ఆమోదించకుంటే చెల్లని బిల్లులైపోతాయా?
Veerappan: వీరప్పన్ బంధువు మృతిపై అనుమానం..
Maharashtra: 167 బారే సిండ్రోమ్ కేసులు నమోదు.. ప్రభుత్వం అలర్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..