Yogi Adityanath: మహాకుంభ్‌పై విమర్శలు.. రహస్యంగా మునకలు
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:31 PM
త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు. ఇలాంటి మాటలు చెబుతున్న వాళ్లకు మహాకుంభ్ గురించి అసలేమీ తెలియదనే చెప్పొచ్చని అన్నారు.

లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ్ (Maha Kumbh)పై విపక్షాలు అనుసరిస్తున్న తీరును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఎండగట్టారు. తప్పుడు సమాచారంతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యావత్ సమాజం నిర్వహించుకున్నట్టు ఉత్సవం ఇదని, దీనిపై బురదచల్లడం ద్వారా హిందువుల మనోభావాలను వారు గాయపరుస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో యోగి పాల్గొంటూ, మహాకుంభ్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
"మహాకుంభ్ ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు అబద్ధాలు, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ మొదటి రోజు నుంచే మహాకుంభ్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. సనాతన్ ధర్మ్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేతలు మాట్లాడుతున్నారు'' అని యోగి తప్పుపట్టారు. మహాకుంభ్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లే రహస్యంగా మహాకుంభ్‌లో పవిత్ర స్నానాలు చేస్తున్నారని పరోక్షంగా అఖిలేష్‌ను ఉద్దేశించి యోగి వ్యాఖ్యానించారు. ''మహాకుంభ్ కాదు...మృత్యుకుంభ్'' అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ఏ తరహా స్టేట్‌మెంట్‌గా అనుకోవాలని మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రశ్నించారు.
సంగమంలో నీళ్ల నాణ్యతకు ఢోకా లేదు..
త్రివేణి సంగమంలో నీళ్లు కలుషితమయ్యాయంటూ కొందరు విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని చెప్పారు. ఇలాంటి మాటలు చెబుతున్న వాళ్లకు మహాకుంభ్ గురించి అసలేమీ తెలియదనే చెప్పొచ్చని అన్నారు. నీటి నాణ్యత క్షీణించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం నీటి నాణ్యతను పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ విదేశాల్లోని ప్రముఖ నేతలతో సహా 55.56 కోట్ల మంది ప్రజలు ఇంతవరకూ సంగమ స్నానాలు చేశారని గుర్తు చేశారు
తొక్కిసలాటపై..
జనవరి 29న మహాకుంభ్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, తనకు తన బాధ్యతలేమిటో తెలుసునని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయోగరాజ్‌కు వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సైతం తాము సంతాపం తెలియజేస్తున్నామన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అవసరమైన సాయం చేస్తుందని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం ఎంతవరకూ సమంజసమో విపక్షాలు ఆలోచించుకోవాలని అన్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన 30 మందికి పోస్ట్‌మార్టం చేయవద్దని వారి కుటుంసభ్యులు కోరినట్టు తెలిపారు. ఆ ఘటనలో 30 మంది మరణించగా, 36 మంది గాయపడినట్టు వివరించారు.
ఇవి కూడా చదవండి..
Delhi CM Oath: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్, అతిషి హాజరవుతారా?
PM Kisan: రైతులకు అలర్ట్.. ఫిబ్రవరి 24లోపు ఈ పని చేయండి.. లేదంటే..
Ayodhya Ram Temple: ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.