Share News

Yogi Adityanath: నేరాలు నిల్, జనం ఫుల్.. మహాకుంభ్ రికార్డిది

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:35 PM

కోట్లాది మందితో ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని, అటు దేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను దేశ ప్రజల విశ్వాసం వమ్ము చేసిందని చెప్పారు.

Yogi Adityanath: నేరాలు నిల్, జనం ఫుల్.. మహాకుంభ్ రికార్డిది

లక్నో: ప్రయాగరాజ్‌ (Prayagraj)లో 45 రోజుల పాటు జరిగిన మహాకుంభ్‌మేళా (Mahakumbh)లో ఒక్క నేరం కానీ, ఈవ్ టీజింగ్ వంటివి కానీ చోటుచేసుకోలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. ఇటీవలే ఘనంగా ముగిసిన మహాకుంభ్‌మేళా-2025 అంశాన్ని ముఖ్యమంత్రి మంగళవారంనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు.

PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్


''45 రోజులపాటు జరిగిన మహాకుంభ్‌కు దేశ, విదేశాల నుంచి 66 కోట్ల మంది హాజరయ్యారు. వీరిలో సగం మంది మహిళలే ఉన్నారు. అయినా ఒక్క వేధింపు ఘటన కానీ, దొంగతనం, అపహరణ, హత్యా ఘటన చేటుచేసుకోలేదు. అంచనాలకు మించి ప్రజలు మహాకుంభ్‌లో పవిత్ర స్నానాలు చేశారు. అద్భుతమైన అనుభూతితో తిరిగి వెళ్లారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌ను అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసలతో ముంచెత్తింది" అని సీఎం చెప్పారు.


కోట్లాది మందితో ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించడం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాన్ని, అటు దేశం సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పగలిగామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను దేశ ప్రజల విశ్వాసం వమ్ము చేసిందని చెప్పారు. మహాకుంభ్ 'మహా' విజయాన్ని సనాతన ధర్మం సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.


ఇవి కూడా చదవండి

Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ

Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు

Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..

Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2025 | 06:39 PM