Maha Kumbh Mela: మహా కుంభమేళా ముగింపు.. 45 రోజుల్లో ఎంత మంది వచ్చారంటే..
ABN , Publish Date - Feb 26 , 2025 | 09:18 PM
మహా శివరాత్రి పండుగ రోజు (ఫిబ్రవరి 26న) చివరి అమృత స్నానంతో మహా కుంభమేళా 2025 ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు స్నానమాచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా (Maha Kumbh Mela) 2025 మహాశివరాత్రి పండుగ రోజైన నేడు (ఫిబ్రవరి 26న) చివరి అమృత స్నానంతో ముగియనుంది. ఈ 45 రోజుల వేడుకలో 66 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. జనవరి 13న మొదలైన ఈ మేళా, బుధవారం వరకు కొనసాగినుంది. ఈ సందర్భంగా చివరి రోజు స్నానం చేస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. దీంతో అక్కడి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో ఇప్పటివరకు 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
సీఎం కృతజ్ఞత..
మహా కుంభమేళా ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహాకుంభమేళా నిర్వహణలో సహాయపడిన ప్రతి ఒక్కరికీ, స్థానిక, పోలీసు పరిపాలన, పారిశుధ్య కార్మికులు, గంగా దూతలు, స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన సంస్థలు, పడవల నిర్వాహకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతోపాటు ఈ విజయానికి కారకులైన ప్రముఖులందరికీ, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు, కల్పవాసులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఎప్పుడు చివరి స్నానం..
నా దృష్టిలో, చివరి భక్తుడు సంగమంలో స్నానం చేసినప్పుడు మహా కుంభమేళ ముగుస్తుందని, గురువారం బ్రహ్మ ముహూర్తం ప్రారంభంతో ఈ వేడుక ముగుస్తుందని రుషికేశ్‌లోని పరమార్థ నికేతన్ ఆశ్రమ అధిపతి చిదానంద సరస్వతి అన్నారు. మహా శివరాత్రి పవిత్ర సందర్భంగా మహా కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో ఈరోజు సాయంత్రం హారతి ఇచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ తారలు, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖుల వరకు అందరూ మహా కుంభమేళా సంగమంలో స్నానం చేశారు.
24 గంటలు విధుల్లో
మహా కుంభమేళా దీని పరిశుభ్రత విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో 15 వేల మంది పారిశుధ్య కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉన్నారని మహా కుంభమేళా పరిశుభ్రత ఇన్‌చార్జ్ డాక్టర్ ఆనంద్ సింగ్ తెలిపారు. అనేక షిఫ్టులలో శుభ్రపరిచే బాధ్యతలను చాలా బాగా నిర్వర్తించారని, జాతరలోని మరుగుదొడ్లు సహా ఘాట్‌లను కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కార్మికుల పని తీరును ఆయన మెచ్చుకున్నారు. ఇక ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా చివరి రోజున, రైల్వే ప్రాంతం మొత్తం యాత్రికులతో నిండిపోయింది. వీరిలో ఎక్కువ మంది ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News