Home » YS Jagan Mohan Reddy
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.
జగన్, షర్మిల పేరిట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొన్ని ఆస్తులు పెట్టారని ఆయన సతీమణి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని విజయమ్మ స్పష్టం చేశారు.
శత్రువులతో చేతులు కలిపి అన్న జగన్పై కుట్రలు పన్నడం ఎవరి కోసమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
వైఎస్ఆర్ మరణానంతరం చార్జిషీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కాదా? అని విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల నిలదీశారు. కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా? అలా చేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారన్నారు. ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
షర్మిల రాజకీయంగా దిగజారిపోయారని..ఆమె ఎవరి పతనం కోరుకుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రత్యర్థుల మోచేయి నీళ్లను షర్మిల తాగుతున్నారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డిపై కనీసం గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
సొంత చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తల్లికి, కుమారుడికి మధ్య ఆస్తుల ఎంఓయూ ఉంటుందని దేశంలో తొలిసారిగా తెలిసిందని చెప్పారు.
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీకి వైసీపీ హయాంలో తీరని నష్టం వాటిల్లింది. జగన్ హయాంలో బ్యారేజీ నిర్వహణను కనీసం పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద రోజురోజుకు కోత పెరుగుతోంది.
జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.
Andhra Pradesh: వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.