YS Vijayamma: పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

ABN, Publish Date - Oct 29 , 2024 | 07:12 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు.

అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ఆస్తుల విషయంలో తన బిడ్డ వైఎస్ షర్మిలకు అన్యాయం జరిగిందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. ఆస్తులు సమానంగా ఇవ్వాలనేది వైఎస్సార్ చెప్పారని అన్నారు. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండటం తన విధి అని తెలిపారు.


అమ్మగా తనకు ఇద్దరూ సమానమేనని స్పష్టం చేశారు. అలాగే ఆస్తులు ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ తేల్చిచెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలే అని చెప్పారు. పెద్ద మనుషులు చెబుతున్న అబబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇవన్నీ చెప్పా అని విజయమ్మ స్పష్టం చేశారు.

Updated at - Oct 29 , 2024 | 07:12 PM