Home » YS Sharmila
పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా వైసీపీ (YSRCP) నేతల తీరు ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని APCC సీనియర్ నేత మస్తాన్ వలి (Mastan Vali) అన్నారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్‌ను ప్రశ్నించారని గుర్తుచేశారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల పూర్తైన సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిందని... కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. అన్న జగన్‌పై షర్మిల సెటైర్ల వర్షం కురిపించారు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ మాత్రమే అని... రాజశేఖర్ రెడ్డికి వైసీపీ జగన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ బీజేపీకి తొత్తులుగా పని చేశారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ప్రతికూలంగా రావడంతో.. ఆపార్టీ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు కొన్నిచోట్ల క్యాడర్ సైతం సైలెంట్ అయిపోయారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి మరిచి.. అరాచకాలకు పాల్పడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రజలు వైసీపీపై ఉన్న కసిని తీర్చుకున్నారనే చర్చ బాగా జరిగింది.
ఏపీ రాజకీయాల్లో నిన్నటి నుంచి కడప లోక్‌సభ స్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీచేస్తారని.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ఇడుపులపాయలోని ఆయన సమాధి సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ‘వైఎస్ఆర్ 75వ జయంతి’ కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.