YS Sharmila: చంద్రబాబు నెల పాలనపై షర్మిల కామెంట్స్
ABN , Publish Date - Jul 12 , 2024 | 03:47 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల పూర్తైన సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిందని... కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు.
విజయవాడ, జూలై 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారంలోకి వచ్చి నెల పూర్తైన సందర్భంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిందని... కూటమి కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన రెండో రోజే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ నెరవేర్చారని తెలిపారు.
CM Chandrababu: కాన్వాయ్ ఆపి.. చంద్రబాబు పెద్ద మనసు!
చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకు ఇంత సమయం పడుతుందని ప్రశ్నించారు. మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగడుతుంది కాబట్టి ఈ అంశం లేవనెత్తుతున్నామన్నారు. ఒక మహిళకి భద్రత అనేది బస్సు ప్రయాణం నుంచి ఉంటుందన్నారు. మహిళలకు పనికొచ్చే ఈ చిన్న పథకానికి ఎందుకు ఇంత సమయం పడుతుందో అర్ధం కావట్లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా అమ్మకి వందనం పథకం ఇవ్వాలన్నారు. ఈ స్కీం లో ప్రతి తల్లికి అన్నారని.. ప్రతి బిడ్డకి ఇవ్వాలన్నారు.
BRS: బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు.. ఢిల్లీ పెద్దలతో కేటీఆర్, హరీష్ చర్చలు..?
చంద్రబాబు ఈ పథకంపై క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.గతంలో జగన్ కూడా హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ప్రతి బిడ్డకి రూ.15వేలు ఇస్తామని తన చేత కూడా ప్రచారం చేయించారన్నారు. వైజాగ్ స్టీల్‌కు ఇంతవరకు కాప్టిమ్ మైన్ లేదన్నారు. మోదీ ఏపీకి పోలవరం, స్పెషల్ స్టేటస్ ఇస్తామని పలు హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదన్నారు. మోదీ అంటేనే మోసం గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్‌ను కాపాడలేకపోయారని విమర్శించారు. వైజాగ్ స్టీల్ నష్టాలలో ఉంటే ఎందుకు తగిన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిందని.. వైజాగ్ స్టీల్‌పై మోదీతో మాట్లాడి ప్రజలకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని షర్మిలా రెడ్డి హితవు పలికారు.
ఇవి కూడా చదవండి..
Andhra Pradesh: ఏపీలో ఎలుకలు చాలా జాదూ గురూ.. ఇలా చేశాయేంటో..!
Viral: ఇది నిజమా గ్రాఫిక్సా.. ఆటోవాలా పవర్ అంటే ఇదేనా! షాక్‌లో నెటిజన్లు
Read Latest Telangana News And Telugu News