Share News

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:24 PM

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని APCC సీనియర్ నేత మస్తాన్ వలి (Mastan Vali) అన్నారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్‌ను ప్రశ్నించారని గుర్తుచేశారు.

Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు..  వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్
Mastan Vali

విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాయలేదని APCC సీనియర్ నేత మస్తాన్ వలి (Mastan Vali) అన్నారు. ‘తల్లికి వందనం’ పథకం మీద కూటమి సర్కార్‌ను షర్మిల ప్రశ్నించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పారని... ఉన్న మాట చెప్తే జగన్ పార్టీకి అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదన్నారు. ఊహాజనిత మాటలు వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి: Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా ? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా తమ మీద దుమ్మెత్తి పోస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి తొత్తుగా ఉండాల్సిన అవసరం తమకు లేదని.. ఆ పార్టీకి బీ టీమ్‌గా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్‌కి లేదని తేల్చిచెప్పారు. తొత్తులుగా బీజేపీ పంచన చేరింది జగన్ రెడ్డినే అని విమర్శలు చేశారు. వైసీపీ బీజేపీకి ఒక తొత్తు పార్టీ అని ఎద్దేవా చేశారు. స్పీకర్ ఎన్నికల్లో సైతం వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ‘అమ్మకు వందనం’ పథకాన్ని చంద్రబాబు అందరికీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రజల పక్షం వైపు ఉంటుందని చెప్పారు. అమ్మఒడి పథకం ప్రకటనలో ఇద్దరి పిల్లలకని హామీ ఇచ్చారన్నారు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు అని జగన్ చెప్పాడని, ఇది నిజం కాదా ? సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పై సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మస్తాన్ వలి ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

Budda Venkanna: నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అయితే... తాచుపాము జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 05:02 PM