AP Politics: రేవంత్ టార్గెట్ కడప వెనుక వ్యూహం అదేనా..?
ABN , Publish Date - Jul 09 , 2024 | 09:12 PM
ఏపీ రాజకీయాల్లో నిన్నటి నుంచి కడప లోక్‌సభ స్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీచేస్తారని.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో నిన్నటి నుంచి కడప లోక్‌సభ స్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి జగన్ ఎంపీగా పోటీచేస్తారని.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరావతి వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వైఎస్సార్ జయంతి వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కడప లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతోందని.. ఉప ఎన్నిక వస్తే అక్కడ కాంగ్రెస్ గెలుపు బాధ్యత తాను తీసుకుంటానన్నారు. అంతేకాదు.. కడపలో మకాం వేసి ఊరూరు తిరుగుతానని చెప్పారు. అప్పటినుంచి కడప లోక్‌సభకు ఉప ఎన్నిక వస్తుందా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలు వెనుక అసలు వ్యూహం ఏమిటి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తాడా.. లేదంటే జగన్‌ను నైతికంగా దెబ్బతీసి.. గతంలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ క్యాడర్‌ను ఆకర్షించడానికే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది.
CM Chandrababu: విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే
రేవంత్ వ్యూహం అదేనా..?
ఏపీలో ఎన్నికలు ఫలితాలు వెలువడి నెల గడిచింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయేలో భాగస్వామ్యపక్షాలుగా ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రస్తుతం ఏపీలో బలహీనపడింది. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ క్యాడర్ ఎక్కువమంది వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం వైసీపీ బలహీనపడటం, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై సొంత క్యాడర్‌లోనే పలు అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని.. వాస్తవానికి ఇప్పటికిప్పుడు కడప లోక్‌సభకు ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు తక్కువని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
AP Cabinet: జులై 16న ఏపీ కేబినెట్ సమావేశం.. ఏం జరుగుతుందో..?
కడపపైనే ఫోకస్..
కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీచేసి లక్షా 41వేల ఓట్లు సాధించారు. ఉప ఎన్నిక వస్తే వైసీపీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ నుంచి మరోసారి పోటీచేస్తే రాజశేఖర్ రెడ్డి ఇమేజ్‌తో గతానికంటే ఎక్కువ ఓట్లు సాధించి కనీసం రెండోస్థానానికి వచ్చినా.. భవిష్యత్తులో ఏపీలో కాంగ్రెస్ బలపడవచ్చనే ఆలోచనతో కడపపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..
SLBC Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telangana News