Home » YS Viveka
వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై..
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) అనేక మలుపులు తిరుగుతోంది. ఎవర్ని విచారించినా.. ఎన్ని కోణాల్లో ప్రశ్నించినా అటు తిరిగి.. ఇటు తిరిగి రక్త సంబంధీకుల వద్దకే చేరుతోంది..
వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka murder case) నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) అరెస్ట్‌కు సీబీఐ (CBI) సన్నద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించిన వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగినట్టైంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది.
వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే..
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు ఎస్పీ సహకరించడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.