Home » YS Viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ చార్జిషీట్లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది.
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు చార్జిషీట్లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ ఇలా వివరించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో వాయిదా పడింది.
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్‌ను రీసబ్మిట్ చేసింది.