Home » YV Subbareddy
తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల నెయ్యి వాడారని కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. ఆ నివేదికతో వైసీపీ నేతలు ఏం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఏపీ సర్కార్‌కు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేశారు.
Andhrapradesh: తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు వాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్న మాటలు వింటుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
అక్రమ కేసులతో వైసీపీ నాయకులను అరెస్టు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba Reddy) అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇల్లు, మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఎంపీ ఖండించారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
బీజేపీకి దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నేతలతో వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు.
AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.
సీఎం జగన్(CM Jagan)తో ఉంటేనే ఎవరికైనా రాజకీయ మనుగడ ఉంటుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు.
Andhrapradesh: హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని... తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు.