Home » YV Subbareddy
తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ స్పందించారు. శుక్రవారం ఉదయం చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.
శ్రీవాణి ట్రస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టుపై ప్రజలకే అనుమానం ఉంది. ట్రస్టుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా..? టీటీడీ.. వై.వి.సుబ్బారెడ్డికి సొంత సంస్థ కాదు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఏమవుతున్నాయి..? ట్రస్టు నిధులతో ఎన్ని ఆలయాలు నిర్మించారు. ఛారిటబుల్ ట్రస్టు అంటేనే పూర్తి ఉచితం.. ఒక్కొక్క భక్తుని నుంచి
ఏడుకొండల స్వామి వారికి ద్రోహం తలపెట్టిన వారు బతికి బట్ట కట్టలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్నారాయణమూర్తి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని...అవసరం అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
జ్ఞానాపురంలో, ఎర్నిమాంబ దేవాలయం, పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో నేడు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఏపీ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్లతో టీటీడీ ఆలయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అలయం నిర్మాణం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఉన్నట్లే కరీంనగర్లోనూ ఆలయం ఉంటుందన్నారు. ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉంటాయన్నారు. తిరుమలలో మాదిరిగా స్వామివారి కైంకర్యాలు ఉంటాయన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం..
బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) వైఎస్ జగన్ ప్లాన్ (YS Jagan Plan) చేశారా..? రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్‌గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందా..? ..
ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం, కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామాతో నానా రచ్చ జరుగుతుండగా నిన్న, మొన్న ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా..