YV Subbareddy: మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2023-10-07T16:36:10+05:30 IST
సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నా
విశాఖపట్నం: సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకురాలు నాగ మల్లీశ్వరి వైసీపీ పార్టీలో చేరారని ఆమె వైసీపీలో చేరడంతో పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఏపీలో మంచి మెజార్టీతో ప్రజలు జగన్మోహన్‌రెడ్డిని గెలిపిస్తారని అన్నారు. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ధూషిస్తే నేతలపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలను జగన్‌రెడ్డి చేపడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.