TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఇబ్బందులుండవ్....

ABN , First Publish Date - 2023-07-27T13:50:07+05:30 IST

తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సెలవుల రోజుల్లో, పండగ సమయాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ వసతి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది.

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఇబ్బందులుండవ్....

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సెలవుల రోజుల్లో, పండగ సమయాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ వసతి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ (TT) ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మొబైల్ ప్రయోగాత్మకంగా కంటైనర్స్‌ను టీటీడీ ప్రవేశపెట్టింది. గురువారం టీటీడీ ట్రాన్స్‌పోర్ట్ డిపోలో మొబైల్ కంటైనర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTDP Chairman YV Subbareddy) ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఇకపై మొబైల్ కంటైనర్స్ టీటీడీ తీసుకురానుంది.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రద్దీ సమయంలో తిరుమలకు వచ్చే భక్తులకు వసతి విషయంలో కొంచెం అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. తిరుమలలో వసతి గదులు నిర్మించేందుకు వీలులేదని.. మొబైల్ కంటైనర్స్ ద్వారా కొంత మంది భక్తులకు వసతి కల్పించే విధంగా యోచిస్తున్నట్లు చెప్పారు. వసతి సదుపాయం దొరకని భక్తులకు.. మొబైల్ కంటైనర్స్‌లో బస చేసే విధంగా రూపొందించామన్నారు. తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే మొబైల్ కంటైనర్‌ను విశాఖపట్నంకు చేందిన మూర్తి విరాళంగా ఇచ్చారని తెలిపారు. మొబైల్ కంటైనర్‌లో 12 మంది బస చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ట్రయల్ క్రింద మొబైల్ కంటైనర్స్‌ను ఏర్పాటు చేసామని.. భక్తులకు ఎక్కువ లాభదాయకంగా ఉంటే భవిష్యత్తులో మరికొన్ని మొబైల్ కంటైనర్స్‌ను ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-07-27T13:55:04+05:30 IST