TTD NEWS: తిరుమల అభివృద్ధికి నిధుల విడుదల
ABN , First Publish Date - 2023-08-07T16:00:26+05:30 IST
తిరుమల ఆలయ అభివృద్ధి(Development of Tirupati Temple)పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman YV Subbareddy) సమీక్ష నిర్వహించారు.
తిరుమల: తిరుమల ఆలయ అభివృద్ధి(Development of Tirupati Temple)పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్మాణాలు, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా పనులకు కావాల్సిన నిధులను విడుదల చేశారు.
తిరుమల అభివృద్ధి పనులు.. నిధుల విడుదల
1. నాలుగు కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలోని మోకాలమెట్టు నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు షెడ్ ఏర్పాటు..
2. 2.25 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డులో ఎలక్ట్రికల్ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్..
3. 2.5 కోట్లతో యాత్రి సముదాయం -1 ఆధునికీకరణ..
4. 24 కోట్లతో ఘాట్ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణం..
5. 4.5 కోట్లతో టీటీడీ ల్యాబ్ ఆధునికీకరణ..
6. 23.5 కోట్లతో తిరుచానూరు పద్మావతి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం..
7. 75.86 కోట్లతో చిన్నపిల్లల ఆస్పత్రిలో పరికరాల కొనుగోలు..
8. 3 కోట్లతో శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద సబ్‌వే నిర్మాణం..
9. 3.10 కోట్లతో శ్రీనివాసమంగాపురం ఆలయ అభివృద్ధి..
10. 9.85 కోట్లతో వకుళమాత ఆలయ అభివృద్ధి..
11. శ్రీనివాససేతు నిర్మాణ పనులకు 188 కోట్ల నిధులు కేటాయింపు..
12. 5 కోట్లతో ఎస్వీ యూనివర్సిటీలో అభివృద్ధి పనులు..
13. 4.25 కోట్లతో స్వామి వారీ కైంకర్యాలకీ ఉపయోగించే నెయ్యి ప్లాంట్ నిర్మాణం..
14. 11.5 కోట్లతో ఎస్వీ ఆయుర్వేదం ఆస్పత్రిలో మొదటి ఫ్లోర్ నిర్మాణం
15. 2.5 కోట్లతో ఎస్వీ ఆయుర్వేదం ఆస్పత్రిలో అభివృద్ధి పనులు..
16. ఎస్వీ ఆయుర్వేదం ఆస్పత్రిలో 3 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణం..
17. 2.2 కోట్లతో రుయా ఆస్పత్రిలో టీబీ వార్డు ఏర్పాటు..
18. 11 కోట్లతో ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో హాస్టల్ భవన నిర్మాణం..
19. 1.65 కోట్లతో వేశాలమ్మ, తాళపాక పెద్ద గంగమ్మ ఆలయం అభివృద్ధి..
20. 1.25 కోట్లతో దేశంలోని 69 టీటీడీ ఆస్తుల వద్ద కంచె నిర్మాణం..
అలాగే టీటీడీ ఆస్థాన విద్వాంసుడుగా బాలకృష్ణ ప్రసాద్‌ను మూడేళ్లు పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..