Vidadala rajini: పురందేశ్వరి.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు
ABN , First Publish Date - 2023-07-29T15:53:07+05:30 IST
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.
విశాఖ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిఫ్ట్ చదువుతున్నారేమోనన్న అనుమానంగా ఉందని మంత్రి విడదల రజిని (Vidadala rajini) వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి విడుదల రజిని, వైవీ. సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy), ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ‘‘పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురందేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న (CM Jagan) మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం. పాలనా రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. రూ. 600 కోట్లు కేజీహెచ్ (KGH) అభివృద్ధికి కేటాయించాo. రూ.153 కోట్లు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11 కోట్లతో సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేశాo. రూ.3820 కోట్లతో మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తున్నాం. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఐదు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చంద్రబాబు (Chandrababu) మెడికల్ కళాశాలపై మాట్లాడే అర్హత లేదు. రూ.600 కోట్లతో రహేజా మాలు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి ఒకటో తారీఖున వస్తున్నారు. అలాగే రూ.135 కోట్ల రూపాయలతో జీవీఎంసీకి సంబంధించి శంకుస్థాపన చేస్తారు.’’ అని మంత్రి తెలిపారు.
వైవీ. సుబ్బారెడ్డి కామెంట్స్..
‘‘వైసీపీ ప్రభుత్వం మీద పురందేశ్వరి కావాలని అవాకులు, చివాకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు దాచి పెట్టాల్సిన పని ఏమీ లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో అన్ని విధాలా బీజేపీకి మద్దతిస్తున్నాం.’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.