Home » Technology
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్(Airtel) అనేక రీఛార్జ్ ప్లాన్లతో వస్తోంది. చాలా ప్లాన్లు తగినంత డేటా, అపరిమిత కాలింగ్, ఎక్కువ కాలం చెల్లుబాటు వ్యవధితో వస్తున్నాయి. ఎయిర్టెల్ నుంచి స్టాండ్అవుట్ రీఛార్జ్ ప్లాన్ అనగానే మొదట గుర్తొచ్చేది రూ. 699 ప్లాన్.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు.
రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి కొత్త మోడల్ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.
స్క్రీన్ లేని ల్యాప్ టాప్ అనగానే ఒకింత ఆశ్చర్యానికి గురికావచ్చు.. కానీ ఇది అక్షరలా నిజం.. త్వరలోనే స్క్రీన్లు లేని ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయడానికి మూలం స్కీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్క్రీన్లోనే చూసేందుకు వీలవుతుంది.
ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
మూడు తులాల బంగారం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను గొంతు పిసికి చంపాడో వ్యక్తి! మృతదేహాలను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు పెట్రోలు పోసి తగులబెట్టి.. కన్నవారు కనిపించడం లేదంటూ స్థానికులకు చెప్పుకొని ఏడ్చాడు!
కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.
కాలమేదైనా ఏసీలు(Air Conditioner), కూలర్లు లేనిదే జీవనం గడవట్లేదు. వేసవి కాలమైతే వీటికి డిమాండ్ భారీగా ఉంటుంది. వేరే సీజన్లలో కూడా కూలర్లు, ఏసీలకు సాధారణ డిమాండ్ ఉంటుంది. అయితే చాలా మంది ఏసీ కొనుగోలు చేసే స్థోమత లేక కూలర్లతో నెట్టుకొచ్చేస్తారు.