YouTube: యూట్యూబ్ మాజీ సీఈవో మృతి.. గూగుల్ సీఈవో ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Aug 10 , 2024 | 04:43 PM
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్‌బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. ఈ ఘటనపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా స్పందించారు.
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్‌కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్‌బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. 56 సంవత్సరాల నా ప్రియమైన భార్య, ఐదుగురు పిల్లలకు తల్లి రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి ఈ రోజు మమ్మల్ని విడిచిపెట్టారని వోజ్కికీ భర్త ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. ఆమె కేవలం CEO మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయకమైన నాయకురాలు, ప్రేమగల భార్య, దయగల తల్లి అని పేర్కొన్నారు. ఆమె 2014 నుంచి 2023 వరకు YouTubeలో పనిచేశారు. ఆ క్రమంలో కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లారు.
మొదటి ఉద్యోగులలో
యూట్యూబ్ మాజీ సీఈఓ, గూగుల్ మొదటి ఉద్యోగులలో ఒకరైన సుసాన్ వోజ్‌కికీ రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో మరణించారని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X వేదికగా స్పందించారు. సుసాన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, తనకు మంచి స్నేహితురాలు అని అభివర్ణించారు. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమన్నారు.
ఆమె లేనప్పుడు
సుసాన్ వోజ్‌కికి మరణం యూట్యూబ్, టెక్ ప్రపంచానికి తీరని లోటు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో YouTube ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌గా మారిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆమె లేనప్పుడు ఎక్కడో ఒక భారీ శూన్యత ఉన్నట్లు అనిపిస్తుందన్నారు.
సోషల్ మీడియా
ఈ క్రమంలో సుసాన్ వోజ్‌కికీ మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సోషల్ మీడియా వేదికగా సందేశాలు చేస్తున్నారు. ఆమె విజయాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. సుసాన్ వోజ్‌కికీ వారసత్వం ఎప్పుడూ గుర్తుండిపోతుందని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌కే కాకుండా యావత్ టెక్ ప్రపంచానికి ఆమె కొత్త దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ఆమె స్ఫూర్తి అనేక మందికి స్ఫూర్తినిస్తుందని కొనియాడుతున్నారు. గత సంవత్సరం Wojcicki తన మెన్లో పార్క్ కాలిఫోర్నియా ఆధారిత గ్యారేజీని Google సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లకు నెలకు $1,700కి అద్దెకు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఈ డేంజర్ వైరస్ పట్ల జాగ్రత్త..!
School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..
Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..
For More Technology News and Telugu News..