Home » Telangana » Karimnagar
కరీంనగర్ నలుదిశలా వేగంగా విస్తరిస్తూ గ్రేటర్ దిశగా అడుగులు వేస్తోందని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి.
ఎట్టకేలకు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై ఊపందుకుంటున్నాయి. వరి కోతలు మొదలై 40 రోజులు గడువడంతో ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియని పరిస్థితుల్లో చాలా మంది రైతులు ధాన్యాన్ని మద్దతు ధర రాకున్నా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు.
వర్కర్ టు ఓనర్ పథకంపై సిరిసిల్ల నేతన్నల ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ పథకానికి శ్రీకారం చుట్టుంది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో షెడ్ల నిర్మాణం చేపట్టింది. పనులు పూర్తి చేసి కార్మికులకు అందించాల్సి ఉండగా షెడ్లను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు.
వానాకాలం సీజన్ ముగిసింది..యాసంగి సీజన్ వచ్చేసింది.. అయినా ప్రభుత్వం రైతు భరోసాపై స్పష్టత ఇవ్వడం లేదు. కనీ సం ఈ సీజన్లోనైనా పెట్టుబడి సాయం అందుతుం దా...అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్ర భుత్వం 2018 వానాకాలం నుంచి 2023 యాసంగి వర కు వరుసగా 12 సార్లు పెట్టుబడి సాయం అందించింది.
మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్టాక్టర్లు సరఫరా చేయలేక చేతులెత్తేశారు. నాణ్యత లేని, తక్కువ సైజు చేప పిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో పోసేందుకు కాంట్రాక్టర్లు చేసిన యత్నాలను మత్స్యకారులు తిప్పికొట్టారు.
ధర్మారం మండలంలో చేపట్టి న ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
విద్య, ఉపాధి, వైద్యం విషయాలపై ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చిన తరువాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశా రు.
ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్కటి నేరవేర్చకుండా ప్రజలను నయవంచన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు ఆరోపించారు.