Home » Telangana » Karimnagar
విద్యార్థుల్లో అ భ్యసనా సామర్థ్యాలను పరీక్షించేందుకు జాతీయ స్థాయి లో నిర్వహించే న్యాస్లో లక్ష్యం మేరకు ఫలితాలు సా ధించడానికి అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఎన్సీఈఆర్టీ జాతీయ సాధన సర్వే (న్యాస్) నిర్వహి స్తోంది.
జిల్లాలో శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం అయ్యింది. నిర్ధేశించిన మేరకు నియమించిన ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు. తొలిరోజు ఎన్యూమరేటర్లు కొంత తడబడినప్పటికీ 13,649 కుటుంబాల సర్వే పూర్తి చేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సామాజిక, అర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తొలిరోజు శనివారం సర్వే ప్రారంభమైంది. సకాలంలో సర్వే పత్రాలు అందకపోవడంతో కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకు మరికొన్ని గ్రామాల్లో మూడు గంటలకు సర్వే ప్రారంభమైంది.
గ్రామ సరిహద్దులు మార్చే వరకు ఇంటింటి సమగ్ర సర్వేను బహిష్కరిస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి శనివారం సర్వేకు వచ్చిన అధికారులకు వినతిపత్రం అందించారు.
సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రైతులకు సూచించారు.
కటిం గ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యా దగా ప్రవర్తించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించమని, ప్రజల్లో ఉండే అపోహలను తొలగించి సంపూర్ణ వివరాలు సేకరించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు.
శాంతి భధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.