Home » Telangana » Karimnagar
తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ (టీవీఏసీ జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
చెంచుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకోవడంలో, ఆ హక్కును వినియోగించుకోవడంలో చదువుకున్న వారికంటే గ్రామీణ ప్రాంత సాధారణ పౌరులే మిన్న అని మరోసారి రుజువైంది.
దక్షిణ కాశిగా పిలుస్తున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధిపై భక్తుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు వరంగా మారింది.
ఈ ఫోటో జిల్లాలోని గొల్లపల్లి మండలం పైడిపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందినది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం చెగ్యాం నిర్వాసితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 కోట్ల ముంపు నష్ట పరిహారానికి సంబంధించిన మిగులు చెక్కులను గురువారం మండలంలోని చెగ్యాం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీతో కలిసి నిర్వాసితులకు అందజేశారు.
సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబాటుతనానికి గురైన బీసీలకు రాజ్యాంగబద్దంగా కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యాల కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు.
బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చనిరాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.