Home » Telangana » Karimnagar
Telangana: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, పూజలు చేయనున్నారు. ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
రాజన్న క్షేత్రంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నో ఏళ్లుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనులకు కదలిక మొదలైంది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు బంద్ బాటపట్టాయి. ఈనెల 20 నుంచి నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించుకున్నాయి. బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఉన్నతాధికారుల హామీలు అమలుకు నోచుకోకపోవడంతో కళాశాలలు మూసివేయడం మినహా మరో మార్గం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.
పొద్దస్తమానం పోగుపోగును పేని అందమైన రంగుల రంగుల చీరలు, బట్టలు నేసిన నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోయారు. పడుగు పోగులు ఉరితాళ్లుగా వేలాడుతుంటే నిత్యం బతుకు చప్పుళ్లు వినిపించిన మరమగ్గాలు మూగబోయాయి.
బ్యాంకుల నుంచి పొందిన రుణాలు వాయిదాల ప్రకారం సక్రమం గా చెల్లించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రాయితీని ప్రభుత్వం మంజూరు చేసింది. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వీఎల్ఆర్ నిధులు విడుదల చేస్తూ సెర్ఫ్ సీఈవో దివ్వా దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అ ధికారి కార్యాలయానికి లేఖ, ఈ మెయిల్ అందింది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో వేగంగా జరుగుతున్నది. గడిచిన పదకొండు రోజుల్లో 85.09 శాతం సర్వే పూర్తికాగా, గ్రామీణ ప్రాంతాల్లో 89.36 శాతం, పట్టణ ప్రాంతాల్లో 77.29 శాతం సర్వే పూర్తయ్యింది.
ప్రమోషన్లు ఇవ్వడంలో యాజమాన్యం జాప్యం చేయడా న్ని నిరసిస్తూ మంగళవారం ఓసీపీ-3లో ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెంట్రల్ లైటింగ్ వీధి దీపాలు సమకూర్చాలని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ విజ్ఞప్తికి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం స్పందించింది.
ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని, కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఖని బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహిం చారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సీపీఐ జిల్లా మూడవ మహాసభల సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి పట్టణంలోని బీవైనగర్ షాదీఖానా వరకు ఎర్రజెండాలు చేతబూని ప్రధాన వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.