Home » Telangana » Nizamabad
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో సాగుతోందని, నాడు కేసీఆర్ ఎత్తుకున్న మాటలో నిజాయితీ ఉందని.. అందుకే సమాజం అంతా వెన్నంటి వచ్చిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తనకు సంస్కరం నేర్పడం కాదు..మెదట తన తండ్రి కేసీఆర్(KCR)కు సంస్కారం నేర్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Nizamabad MP Dharmapuri Arvind) మంత్రి కేటీఆర్(Minister KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థుల భవిత పునాదుల స్థాయిలోనే కునారిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు.
వైద్యో నారాయణ హరి అంటూ.. సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెస్తూ చట్టాలను సైతం అతిక్రమిస్తు కాసుల కోసం ఎంతటిపనికైనా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సాధారణ ప్రసవాలు చేయకుండా మహిళల భవిష్యత్తు ఆరోగ్య సమస్యలు ఏమైతే మాకేంటి అనే ధోరణి ప్రదర్శిస్తూ అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తు డబ్బులు దండుకుంటున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతం మరో దందాకు తెరలేపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని ఎక్కపల్లిలో గత ఐదు రోజులుగా అటవీ భూముల విషయంలో చెట్లు, పొదలు నరికివేతపై గురువారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రభాకర్లతో పాటు ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ఎఫ్ఆర్వో ఓంకార్‌లతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు.
కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని విద్యార్థి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభం సమయంలో సీఎం కేసీఆర్ వైద్య కళాశాల ఏర్పాటుపై హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటి నిర్మాణానికి రూ.3లక్షలు అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ కుసంస్కారంగా.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. హిందువులు, ముస్లింలు అంటూ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిజామాబాద్ అభివృద్ధి చెందింది. కొంతమంది ఎలక్షన్ రాగానే మీ ముందుకు వస్తారు.
ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే.. ఆ వ్యక్తి వెనుక ఎంతటి వేదన ఉండాలి? కొందరైతే ఏదో క్షణికావేశంలో ఆ నిర్ణయం తీసుుంటారు. కానీ అందరూ అలా కాదు కదా. ఎంతో స్ట్రగుల్ అయి ఇక జీవితాన్ని సాగించడం కష్టమనుకుని ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ కల నెరవేర్చుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఈ సారి టికెట్ ఇచ్చే విధానం మారిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉంటే, సర్వే, నివేదికలు, క్యాడర్ అభిప్రాయాల్లో ఎవరికి మొగ్గు ఉంటే వారికే టికెట్ దక్కుతుందన్నారు.