MP Arvind : కేసీఆర్‌కు సంస్కరం నేర్పాలి

ABN , First Publish Date - 2023-08-12T15:10:29+05:30 IST

తనకు సంస్కరం నేర్పడం కాదు..మెదట తన తండ్రి కేసీఆర్‌(KCR)కు సంస్కారం నేర్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Nizamabad MP Dharmapuri Arvind) మంత్రి కేటీఆర్‌(Minister KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP  Arvind : కేసీఆర్‌కు సంస్కరం  నేర్పాలి

నిజామాబాద్(Nizamabad) : తనకు సంస్కరం నేర్పడం కాదు..మెదట తన తండ్రి కేసీఆర్‌(KCR)కు సంస్కారం నేర్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(
Nizamabad MP Dharmapuri Arvind) మంత్రి కేటీఆర్‌(Minister KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా తండ్రి డి.శ్రీనివాస్(D. Srinivas) నాకు సంస్కారం నేర్పించారు. అలాగే సీఎం కేసీఆర్‌కు సంస్కారం నేర్పిన ముగ్గురిలో నేనూ ఒకడిని. తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతుంది.ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. అన్నీవిషయాలపై మాట్లాడే లిక్కర్ రాణి ఎమ్మెల్సీకవిత‌ (MLC KAVITHA) కోర్టుకు నోటిఫికేషన్లు ఎందుకు వెళ్తున్నాయో సమాధానం చెప్పాలి. వైన్స్ టెండర్ల(Wines tenders)కు మాత్రం తెలంగాణలో ఎలాంటి సమస్య ఉండదు.తెలంగాణలో గృహనిర్మాణ శాఖనే లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరు కడుతారు. ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు.. రేషన్ కార్డుకు ఎందుకు దరఖాస్తు చేసుకోవాలి.గృహలక్ష్మీ పథకం దరఖాస్తుకు మూడు రోజులే సమయం ఇస్తారు. కులదృవీకరణ సర్టిఫికేట్‌కు మాత్రం నెల రోజులు ఎదురు చూడాలి’’ అని అరవింద్ బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS FOVT)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-12T15:10:29+05:30 IST