Home » Telangana
అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన కాట్రియాల రాజు (45) తనకున్న ఎకరం అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు.
మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ నుంచి కాకుండా ఆ నది జన్మించిన అనంతగిరి కొండల నుంచి ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
నర్సింగ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 95.69 శాతం మంది హాజరైనట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
నేర న్యాయ వ్యవస్థలో ‘నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలకా్ట్రనిక్ ప్రాసెసెస్ (ఎన్‌స్టె్‌ప)’ అమలుతో పారదర్శకత మరింత పెరుగుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024కు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రకటించిన గడువు శనివారంతో ముగిసింది.
హైదరాబాద్‌లో వచ్చే నెల 8 నుంచి 16 వరకు అగ్నివీర్ల నియామక ర్యాలీ ఉందని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో అగ్నివీర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
సింగరేణిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ చేసిన కార్మికులకు ఈ నెల 27న దీపావళి బోన్‌సను జమచేయాలని సంస్థ నిర్ణయించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యతో సీఎం రేవంత్‌రెడ్డికి గానీ, ఆయన సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు.
చికిత్స కోసం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చిన నెలరోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.