Home » Telangana
భారతదేశం మొత్తాన్ని సైకిల్పై చుట్టి రావాలని యువకులు సంకల్పించారు. ముగ్గురు యువకులు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్యాత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుహ్యంగా ముగ్గురు కేరళలోని కొచ్చిలో కలిసి చేయి, చేయి కలిపి ఒక్కటిగా యాత్రకు సాగుతున్నారు.
నల్లగొండ జిల్లా జిల్లా నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత కేంద్రంలోని రెండో నెంబరు టర్బైన మరమ్మతులు పూర్తయ్యాయి.
నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు ఆయకట్టులో రైతులు యాసంగి సీజనలో భారీగా వరి సాగు చేపట్టారు.
నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. మూడు నెలల కాలంలో సరుకుల ధరలు 20 నుంచి 30 శాతానికి పెరిగాయి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్లి జేబుల్లో సరుకులు తెచ్చుకునేలా పరిస్థితులు మారాయి. ఏ వస్తువు ధర చూసినా సామాన్యుడి గుండె ఆగినంత పనవుతుంది. పప్పులు నిప్పుల్లా వేగుతున్నాయి.
నారాయణపేట జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఐదేళ్ల పాలక వర్గాల పదవీకాలం ముగిసేందుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో పాలకవర్గ సభ్యుల్లో ఆందోళనతో పాటు హడావుడి మొద లైంది. తమ వార్డుల్లో పెండింగ్ పనులను పూర్తి చేసుకు నేందుకు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. కొందరు కౌన్సిలర్లు వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 వరకు పాలకవర్గం గడువు ముగియనున్నది.
రాష్ట్రం లోనే ఉత్తమ జనరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వనపర్తి జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా 559 యూనిట్ల రక్తం సేకరించినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని గద్వాల డీఎస్పీ వై.మొగలయ్య సూచించారు.
శాంతినగ ర్కు చెందిన కిరాణం వ్యాపారి రమేష్ కిడ్నాప్ కేసును పోలీసులు 24గంటల్లో ఛేదించడం ఎం తో అభినందనీయమని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.