Home » Telangana » Rangareddy
మండల పరిధిలోని హైదరాబాద్-నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై తక్కళ్లపల్లి బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. బ్రిడ్జిపై పలుచోట్ల గుంతలు పడటంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
పంట పొలాల వద్ద వ్యవసాయ పనిముట్లను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకొని పోలీ్సలకు అప్పగించిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పామెన గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల పోలీసులు సిబ్బంది ఈనెల 11న ఇంద్రారెడ్డి నగర్లో పెట్రోలింగ్ చేస్తుండగా రోడ్డుపక్కన గుర్తుతెలియని సుమారు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఉండడంతో పాటు హైదరాబాద్ నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో వందల కోట్ల విలువ చేసే సీలింగ్, భూదాన్, ఇనామ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.
మండలంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్కు కోసం టీజీఐఐసీ భూ బాఽధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.బూరనర్సయ్యగౌడ్ అన్నారు.
పల్లెల్లో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలకు దిగారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించారు. అనేక చోట్ల పారిశుధ్య అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించిన ఆయన చర్యలకు ఉపక్రమించారు.
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.
వికారాబాద్ జిల్లాకు కాగ్నా, కాక్రవేణి నదులు తలమానికంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని వనరులు ఇక్కడ ఉన్నాయి.
కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని నవాంద్గీ సంగమేశ్వరాలయంలో 1001 దీపోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
నేల తల్లినే నమ్ముకున్న రైతుకు పొలమే ఆధారం. అమ్మలాంటి సాగు భూమిని రియల్ వ్యాపారుల పరం చేసేందుకు మనసు రాక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.