Home » Telangana » Warangal
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన పచ్చిమిర్చి, ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
అరకొర వసతులతో కూనారిల్లుతున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటీఐ)లు త్వరలో కొత్తరూపును సంతరించుకోబోతున్నాయి. కాలం చెల్లించిన సంప్రదా య కోర్సులతోనే ఇప్పటికీ నెట్టుకువస్తున్న ఈ ఐటీఐల లో ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఆధునాతన సాంకేతిక కోర్సులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతు న్నారు. ఉద్యోగ భద్రత లేక నిత్యం ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనంతో నానా అవస్థలు పడుతున్నారు. 2012లో సమగ్రశిక్ష అభియాన్‌లో సీఆర్పీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా సీఆర్పీలు పని చేస్తున్నారు.
వనాకాలం వచ్చేసింది. ఎప్పటి లాగే ఈసారి కూడా లోతట్టు ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైం ది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు సన్నద్ధ మైంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటనలతో అలర్ట్ అయ్యింది.
దశాబ్దకాలం నాటి కల.. ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కుఫ్యాక్టరీ ఇప్పట్లో సాకారమయ్యేలా లేదు. ఆ స్థానంలో ప్రత్యామ్నాయంగా డ్రైపోర్టు ఏర్పాటు చేసైనా మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ దిశగా ఉపాధి కల్పన కోసం గిరిజన ప్రాబల్య జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. తీరప్రాంత తమిళనాడు ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న మహబూబాబాద్ జిల్లా లో డ్రైపోర్టు ఏర్పాటుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
వరంగల్ నగరాభివృద్ధికి నిర్వహించిన బల్దియా 2024-2025 బడ్జెట్ సమావేశం రసాభాసాగా సాగింది. జీడబ్ల్యూఎంసీ సమావేశ మందిరం గురువారం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అయితే ముందుగా అనుకున్నట్టుగానే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్కు చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 11 మంది కార్పొరేటర్లతో పాటు కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉదయం 11 గంటలకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు చేరుకున్నారు. కొందరు నల్లబ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి బడ్జెట్ సమావేశానికి హాజరుకాగా, మరికొందరు నల్ల దుస్తులు వేసుకుని వచ్చారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెట్టి అమలు చేస్తోంది. మూడేళ్ల క్రితం ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది. ఇలా ఏటా ఒక్కో తరగతిని పెంచుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్య మం బోధించనున్నారు.
సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర బడ్జెట్లో రూ.889 కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరడం సానుకూలాంశం కాగా.. పునాదిరాయి పడటానికి ముహూర్తం ఎప్పుడొస్తుందనే చర్చ జరుగుతోంది.
చేర్యాల(Cheryala) మండలం కమలాయపల్లి( Kamalayapally) గ్రామంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగంతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
కళ్లెం టెక్స్టైల్ పార్కు బాలారిష్టాల్లో చిక్కుకుం ది. సకల సౌకర్యాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైట్లు సిద్ధం చేసి ఔత్సాహికులకు కేటాయించినా పరిశ్రమ ప్రారంభం కావడంలేదు. ఒక్క యూనిట్ ప్రారంభించాలంటే రూ.కోటికి పైగా నిధులు అవసరం కావడంతో లబ్ధిదారులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి బ్యాంక ర్లతో మాట్లాడి రుణాల విషయంలో వెసులుబా టు కల్పిస్తే తప్ప అడుగుముందుకు పడే పరిస్థితి కనిపించడంలేదు.