Home » Telangana » Warangal
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ లు), మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ లు) ఎన్నికలు గడువులోపు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీలకు మాదిరిగానే జిల్లా, మం డల పరిషత్తులకు కూడా ప్రత్యేక పాలనాధికారులను నియమిం చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రాదేశిక ని యోజవర్గాల పాలక వర్గాల గడువు జూలై 4వ తేదీతో ము గియనున్నది.
భూపాలపల్లి జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గురువారం భూపాలపల్లిలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యూయేట్ ఎన్నిక జరిగినప్పుడల్లా మనమే గెలిచామని, బిట్స్ పిలానిలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపిచ్చారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్‌గా చేసుకుని.. ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో రైతులు పండించే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చే పథకాన్ని వచ్చే వానా కాలం సీజన్ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్‌లో సన్న రకం వరి సాగు గణనీయంగా పెరిగనున్నది. సాధారణ వరి సాగు విస్తీర్ణం కన్నా అదనంగా 15 నుంచి 20 శాతం పెరగవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధరణంగా ఖరీఫ్‌లో వరిసాగు 80 నుంచి 82 శాతం ఉంటుంది.
రోజు రోజుకూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. విద్యుత్ ఆధారిత అవసరాలు సైతం అదే స్థాయిలో ఉండడంతో విద్యుత్ ఉత్పాదకతపై ప్రభుత్యాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహా భియాన్)యోజన పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించింది.
వేసవి చివరి దశకు చేరుకుంది. వానాకాల ఆగమనం త్వరలోనే ఉంది. రైతన్నలు వ్యవసాయానికి సన్నద్ధమవుతు న్నారు. యాసంగి ముగియగా ఖరీఫ్ పంటలు వేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తత అవసరమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమార్కులు, దళారుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.
స్థల వివాదం కారణం.. ఏకంగా సమ్మక్క సారలమ్మ ఆలయం(Medaram Temple) మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం నేపథ్యంలోనే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని(Sammakka Saralamma Temple) రెండు రోజులు మూసివేస్తున్నట్లు మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు. మే 29, 30వ తేదీల్లో సమ్మక్క - సారలమ్మ ఆలయాలను..
నగరంలోని అవుటర్ రింగ్ రోడ్డు పలు అక్రమాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్డు ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్చగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ ఆర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది.
హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.