Share News

TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం: ప్రేమేందర్ రెడ్డి

ABN , Publish Date - May 19 , 2024 | 01:27 PM

హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు.

TG News: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చరిత్రత్మకం:  ప్రేమేందర్ రెడ్డి

హనుమకొండ: ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC by-Election) చరిత్రాత్మకమని, 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ (BJP)కి ప్రజాప్రతినిధులు లేరని, అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని వరంగల్ (Warangal)-ఖమ్మం (Khammam)- నల్గొండ (Nalgonda) పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (Gujjula Premender Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హనుమకొండలో మీట్ ద ప్రెస్‌ (Meet the Press)లో మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే వ్యాగన్ పరిశ్రమ, టెక్స్ టైల్ పార్క్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ నెలకొల్పామన్నారు. రామప్పకు యూనిస్కో గుర్తింపు ఇచ్చి, కాకతీయల సంస్కృతిక పునర్ః వైభవం కోసం మోదీ ప్రభుత్వం (Modi Govt.) కృషి చేస్తోందన్నారు. జాతీయ రహదారి రాయగిరి - వరంగల్‌కు సిమెంట్‌తో నిర్మాణం చేసి చూపించామని, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఎరువుల సబ్సిడీ, పీఎం కిసాన్ నిధి ద్వారా నేరుగా రైతులకు డబ్బులు అందించామన్నారు.


నరేంద్ర మోదీ మరో సారి గెలిచి ప్రధానమంత్రి హ్యాట్రిక్ కాబోతున్నారని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రాజకీయ చైతన్యం, ఉద్యమల గడ్డ అయిన వరంగల్ అని దేశం అంతా మోదీ ప్రభంజనం ఉందన్నారు. 317, 46 జీవోలతో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌వి గారడీ మాటలని, గ్యారెంటీ లేదని విమర్శించారు. అధికారం కోసం అబద్ధాలు ప్రచారం చేసి అడ్డదారులు తొక్కారన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి గెలిపించాలని ప్రేమేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 01:29 PM