Share News

KCR: మోదీ పాలనలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు..?

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:18 PM

మోదీ పాలనలో తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు. శనివారం నాడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు గొప్పదినం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దినమని తెలిపారు.

KCR: మోదీ పాలనలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు..?
BRS Chief KCR

నాగర్‌కర్నూలు జిల్లా: మోదీ పాలనలో తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రశ్నించారు. శనివారం నాడు నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్ షోకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) , ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు గొప్పదినం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన దినమని తెలిపారు.


KCR: ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేళ కేసీఆర్ తొలి పోస్ట్

తాను మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నామని.. పాలమూరును తాను మరువలేనని చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు ఐదు మెడికల్ కళాశాలలు వచ్చాయని గుర్తుచేశారు. తన హయాంలో 24 గంటలు కరెంటు ఉందని.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో 225 మంది రైతులు మృతి చెందారని ఆందోళన వ్యక్తం చేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. తప్పితే హామీలు అమలు చేయడం చేతకావట్లేదని ధ్వజమెత్తారు.తన పాలనలో టెన్షన్‌గా రైతుబంధు పడేదని.. ఇప్పుడు చాలా మంది రైతులకు రైతుబంధు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మీ మద్దతుతోనే తెలంగాణ తెచ్చానని ఉద్ఘాటించారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెడలు వంచి హామీలు అమలు చేయిస్తానని మాటిచ్చారు. ప్రధాని మోదీ ‘సబ్‌కా సాత్.. సబ్ కా వికాస్’ వల్ల దేశంలో ఏమైనా మారాయా అని ప్రశ్నించారు.దేశంలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పేద పిల్లలు చదువుకునేవారని... కానీ మోదీ ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ నిలదీశారు.


TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని తాను అడిగినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మోదీ రైతులకు మీటర్లు పెట్టమని చెప్పారని... నా తల తెగిపడ్డా సరే కానీ తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు పెట్టనివ్వలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సెక్యూలర్ పార్టీ బీఆర్ఎస్.. ఈ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురించి అవహేళనగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అట్టడుగు ప్రజలను పైకి తేవాలనే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ప్రవీణ్ కుమార్‌ను ఎంపీగా గెలిపించాలని కేసీఆర్ కోరారు.


నాగర్ కర్నూల్‌‌ను అభివృద్ధి చేస్తా: ప్రవీణ్ కుమార్

నాగర్ కర్నూల్‌ను ప్రపంచ పటంలో చూపించేందుకు ప్రయత్నిస్తానని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే నాగర్ కర్నూల్‌‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... తాను పార్లమెంట్‌కు పోతే మీరంతా పోయినట్లేనని వివరించారు. కేసీఆర్ పాలన నిజం.. నిజం గెలవాలే అబద్ధం ఓడాలని పిలుపునిచ్చారు. ఈ రోడ్‌షోలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లవెంకటరామారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్‌

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 09:42 PM