Jagan Sarkar : 3 రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నాక Kurnool లో కనిపించిన సీన్ ఇదీ..
ABN , First Publish Date - 2021-11-22T19:32:36+05:30 IST
మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు...
కర్నూలు : మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా జగన్ సర్కార్ నిర్ణయంతో కర్నూలు జిల్లాలో బార్ అసోసియేషన్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం నిర్ణయంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని వారు చెబుతున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ నాయకులు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆప్షన్స్ ఇవీ..
‘హైకోర్టుపై పెట్టుకున్న మా ఆశలపై ప్రభుత్వం నీళ్లు చెల్లింది. ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి రీ నోటిఫికేషన్ ఇప్పించాలి. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.. లేదా రాజధాని ఏర్పాటు చేయాలి. ఈ రెండూ కాకుంటే ప్రత్యేక రాయలసీమను చేయాలి. లేకపోతే ప్రభుత్వం రాయలసీమ వాసుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది’ బార్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. అయితే హైకోర్టును మాత్రం కర్నూలు జిల్లాలోనే పెడతారని కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరికాసేపట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయనున్న కీలక ప్రకటనలో ఏముందో.. ఏంటో మరి.