YS Jagan Mohan Reddy: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ABN , First Publish Date - 2022-12-28T12:58:21+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమావేశమ్యారు.

YS Jagan Mohan Reddy: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బుధవారం సమావేశమ్యారు. రుణ పరిమితి పెంపుపైన ప్రధానంగా ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీకి రావలసిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం, మెడికల్ కళాశాలలు, తెలంగాణ విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై కూడా ప్రధానికి విజ్ఞాపన పత్రం అందజేయనున్నారు. కాగా... ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని, పోలవరం అనుకున్న సమయానికి పూర్తికాదని, బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని చెప్పడం, విజయవాడ మెట్రోపై సవరించిన డీపీఆర్ కోరడం సహా అనేక అంశాలపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం సమాధానాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని గతంలో ఇచ్చిన విజ్ఞాపనలు పరిష్కరించాలని మరోసారి ప్రధానిని సీఎం జగన్ కోరారు.

Updated Date - 2022-12-28T13:34:49+05:30 IST