తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..
ABN , First Publish Date - 2022-11-09T16:12:35+05:30 IST
రద్దీగా ఉన్న రోడ్లపై వేకువజాము నుంచే కొందరు విగలాంగ పిల్లలు, మహిళలు వాహనాలను ఆపి అడుక్కోవడం చూసి అంతా చలించిపోయారు. కళ్లు పోయిన వారు కొందరైతే.. కాళ్లు, చేతులు పోగొట్టుకుని.. విధి లేని పరిస్థితుల్లో భిక్షాటనకు దిగిన వారు మరికొందరు. వీరిని చూసి అంతా.. అయ్యో పాపం! అంటూ..
రద్దీగా ఉన్న రోడ్లపై వేకువజాము నుంచే కొందరు విగలాంగ పిల్లలు, మహిళలు వాహనాలను ఆపి అడుక్కోవడం చూసి అంతా చలించిపోయారు. కళ్లు పోయిన వారు కొందరైతే.. కాళ్లు, చేతులు పోగొట్టుకుని.. విధి లేని పరిస్థితుల్లో భిక్షాటనకు దిగిన వారు మరికొందరు. వీరిని చూసి అంతా.. అయ్యో పాపం! అంటూ సానుభూతి చూపించారు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేశారు. గంటల వ్యవధిలోనే రూ.2000వరకు డబ్బులు అందుకున్నారు. ఇలా రోజూ వీరు భిక్షాటన చేస్తున్నా.. వారి జీవితాలు మాత్రం ఏమాత్రం మారవు. చివరకు అసలు విషయం తెలుసుకున్న ప్రజలు.. తల్లీకొడుకులు అయ్యుండి ఇదేం పని అంటూ ఛీదరించుకున్నారు. అచ్చం విజయ్ సినిమాల్లో (tamil hero vijay movies) చూపించినట్లుగా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వ్యాపారిని ఇంటికి తీసుకెళ్లి.. ఉద్యోగం అడిగిన మహిళ.. మరుక్షణం మరో మహిళతో కలిసి...
ఢిల్లీ, ముంబై (Delhi, Mumbai) తదితర ప్రధాన నగరాల్లోని కూడళ్ల వద్ద చాలా మంది పిల్లలు, మహిళలు (Children and women).. వేకువజాము నుంచే అడుక్కుంటూ కనిపిస్తారు. వీరిని చూస్తే హృదయం చలించిపోయే విధంగా కనిపిస్తారు. కళ్లు పోయి కొందరు, కాళ్లు, చేతులు పొగొట్టుకుని దయనీయ స్థితిలో ఉంటారు. వీరిని చూసిన ఎవరైనా సాయం చేయకుండా ఉండలేరు. ఇలా రోజూ వీరికి వేల రూపాయల (Thousands of rupees) ఆదాయం వస్తుంటుంది. అయినా వీరికి మాత్రం ఒక్క రూపాయి కూడా అందదు. ఇదంతా చూస్తుంటే ఎక్కడో సినిమాల్లో చూసినట్లుగా ఉంది కదా. అవును తమిళ హీరో విజయ్ నటించిన పోలీసోడు, మాస్టర్ సినిమాల్లో ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన కూడా అందులో చూపించినట్లుగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన సురేష్ మాంఘీ అనే బాలుడు ఆరు నెలల క్రితం తప్పిపోయాడు. ఇటీవలే ఇంటికి చేరుకుని, పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. చివరకు ఆశా అనే మహిళ, ఆమె కుమారుడు రాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో.. ఓ రోజు భయంభయంగానే..
ఈ తల్లీకొడుకులు సురేష్ మాంఘీని విజయ్ అనే వ్యక్తి నుంచి రూ.25వేలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. చాలా మంది ముఠాగా ఏర్పడి.. పిల్లలు, మహిళను కిడ్నాప్ చేస్తుంటారు. తర్వాత కొందరిని గుడ్డి వాళ్లగా మార్చి.. మరికొందరి కాళ్లు, చేతులు విరగొడతారు. ఇంకొందరికి ముఖంపై గాయాలు చేస్తుంటారు. తర్వాత వారిని ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లోని ప్రధాన రహదారులపై భిక్షాటనకు వదిలేస్తారు. వారి ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం ముఠా సభ్యులు తీసుకుంటూ ఉంటారు. ఈ ముఠా బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నట్లు సురేష్ తెలిపాడు. భిక్షాటన ద్వారా రోజూ వచ్చే వేల రూపాయల ఆదాయం ముఠా సభ్యులకు వెళ్తుంటుందని చెప్పాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న తల్లీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ విజయ్, మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ..